పాపం.. మహిళా పైలట్! | first afghani woman pilot seeks asylum in usa, facing threats | Sakshi
Sakshi News home page

పాపం.. మహిళా పైలట్!

Published Mon, Dec 26 2016 9:56 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

పాపం.. మహిళా పైలట్! - Sakshi

పాపం.. మహిళా పైలట్!

అఫ్ఘానిస్థాన్ వైమానిక దళంలో మొట్టమొదటి మహిళా పైలట్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మీడియాను ఆమె ఆకర్షించింది.

అఫ్ఘానిస్థాన్ వైమానిక దళంలో మొట్టమొదటి మహిళా పైలట్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా మీడియాను ఆమె ఆకర్షించింది. కానీ ఇప్పుడు అక్కడ కష్టాలు భరించలేక.. అమెరికాలో ఆశ్రయం కోరుతోంది. ఇప్పటికి 15 నెలలుగా టెక్సాస్‌లో శిక్షణ పొందుతున్న కెప్టెన్ నీలోఫర్ రహమానీ.. తాను ఇక అక్కడే ఉండిపోతానని చెబుతోంది. అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితులు ఏమాత్రం మారకపోగా, అవి రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయని ఆమె వాపోయింది. తాను ఇప్పటికీ మిలటరీ పైలట్‌గానే ఉండాలనుకుంటున్నాను గానీ, తన సొంత దేశంలో మాత్రం కాదని ఆమె తన అమెరికన్ శిక్షకులకు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
తనకు అమెరికాలో ఆశ్రయం కావాలంటూ ఇప్పటికే ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసింది. అక్కడే ఆమె ఎయిర్‌ఫోర్సులో చేరే అవకాశం కనిపిస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమెను చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. అఫ్ఘానిస్థాన్‌లో మొట్టమొదటి మహిళా పైలట్ కావడంతో ఆమెకు తొలుత మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. గత సంవత్సరం ఆమెకు వాషింగ్టన్‌లో ఇంటర్నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు కూడా లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement