ఫ్లారిడా : అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రంలో రోడ్డుపై విమానం కుప్పకూలింది. ఫ్లారిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్క్ అలెన్ బెనెడిక్ట్(61) అనే పైలట్ రాక్‌వెల్ కమాండర్ 112 విమానాన్ని క్లియర్‌వాటర్ ఎయిర్‌పార్క్ నుంచి తీసుకెళ్లినట్లు చెప్పారు. మార్క్‌తో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి జెఫైర్ హిల్స్ మున్సిపల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని తెలిపారు.
విమానంలో ఇంధనం నింపుకున్న అనంతరం తిరిగి క్లియర్‌వాటర్ ఎయిర్‌పార్క్‌కు బయల్దేరినట్లు వెల్లడించారు. మార్గమధ్యంలో ఇంజిన్‌లో లోపం తలెత్తిందని పైలట్ మెసేజ్ పంపడంతో తాము అలర్ట్ అయినట్లు చెప్పారు. రోడ్డుపై తాను విమానాన్ని ల్యాండ్ చేయనున్నట్లు పైలట్ ముందే సమాచారం అందించాడని వివరించారు. విమానం ల్యాండ్ అయ్యే స్థలానికి తాము ముందే వెళ్లామని చెప్పారు.
అయితే, విమానం రోడ్డుపై దిగడానికి వస్తున్న సమయంలో ఎడమ రెక్కకు చెట్టు తగలినట్లు తెలిపారు. దీంతో విమానం గాలిలో పల్టీలు కొడుతూ రోడ్డుపై కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి పైలట్, అతని స్నేహితుడు సురక్షితంగా బయటపడినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment