2018 సంవత్సరానికి ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ అతి సంపన్నుల జాబితా గొప్ప ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మహిళలు అదరగొట్టారని ఫోర్బ్స్ అసిస్టెంట్ మేనేజింగ్ ఎడిటర్ లూయిసా క్రోల్ ప్రకటించారు. రికార్డు స్థాయిలో 255 మంది మహిళలు ఈ సంవత్సరం కొత్తగా ర్యాంకింగ్‌లో చేరారని తెలిపారు. 2018 జాబితాలో అరవై ఏడు శాతం సెల్ప్ మేడ్ బిలియనీర్లుగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా చైనాకు చెందిన మహిళా వ్యాపారవేత్త సెల్ఫ్ మేడ్ బిలియనీర్ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు. ఇది చాలా ఉత్సాహకరమైన పరిణామమని క్రోల్ సంతోషం వ్యక్తం చేశారు.
కొత్తగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న 255 మందిలో 72మంది మహిళలు తమకు తాముగా రాణించిన వ్యాపారవేత్తలుగా నిలిచారు. చైనీస్ వ్యాపారవేత్త, లెన్స్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలు, సీఈవో జౌ క్యున్‌ఫియా (48) నికర సంపద 7.8 బిలియన్ డాలర్లతో జాబితాలో ధనవంతురాలైన మహిళగా ఉన్నారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన జౌ చదువుకు స్వస్తి చెప్పారు. 16 ఏళ్లవరకు ఒక ఫ్యాక్టరీలో కార్మికురాలిగా పనిచేశారు. అనంతరం స్మార్ట్‌ఫోన్లలో వాడే టచ్ స్క్రీన్ తయారీ సంస్థను స్థాపించారని క్రోల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment