మెర్సీ మామి.. యమా క్రేజీ.. | fran's old woman mersi mami stunts hulchul in social media | Sakshi
Sakshi News home page

మెర్సీ మామి.. యమా క్రేజీ..

Published Sun, Oct 30 2016 3:53 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

మెర్సీ మామి.. యమా క్రేజీ.. - Sakshi

మెర్సీ మామి.. యమా క్రేజీ..

సాధారణంగా 60 ఏళ్ల తర్వాత వయసురీత్యా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ 82 ఏళ్ల ఈ బామ్మగారు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించడమే కాదు తాను ప్రయాణిస్తున్న రైల్లోని ప్రయాణికులను సైతం ఆనందంగా ఉంచారు. ఆ బామ్మ పేరేంటో తెలియదు కానీ ఆమె చేసిన విన్యాసాలు మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఎంతోమంది యువకులు, మధ్య వయస్కులు ఉన్నా.. వారి ముందు ఫీట్లు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ ఫ్రాన్స్‌ బామ్మ రైల్లో హుషారుగా సినిమా తరహాలో కొన్ని ఫీట్లు చేశారు. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లు చేసే ఓ స్టంట్‌ చేసి ఔరా అనిపించారు. ఆమె ఎదురుగా కొంతమంది చేతులు పైకెత్తి నిలుచుండగా, బామ్మగారు వారి చేతులపైకి జంప్‌ చేసి చేతులపై నుంచి పాకుతూ అలాగే ముందుకెళ్లి కిందకి దిగారు. ఆ తర్వాత తలపై భారం మోపుతూ మరో ఫీట్‌ చేశారు. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇతరత్రా సమస్యలు తనకేం లేవని చెప్పిన బామ్మ.. నేలపై తల వంచి శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ కాసేపు కాళ్లను నిటారుగా ఉంచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఫీట్లు చేస్తున్నంతసేపూ అక్కడున్న వారు బామ్మను ‘మెర్సీ మామి’ అంటూ ఉత్సాహపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement