ఈయనే మా ఆయన.. | Girl, 18, marries a stray dog from her village in India to lift ‘curse’ | Sakshi
Sakshi News home page

ఈయనే మా ఆయన..

Published Thu, Sep 4 2014 12:26 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

ఈయనే మా ఆయన.. - Sakshi

ఈయనే మా ఆయన..

మీరు చూస్తున్నది నిజమే.. చిత్రంలోని మంగ్లీ ముండా(18) భర్త ఈ శునకమే.. పేరు షేరూ.. జార్ఖండ్‌లోని ఓ కుగ్రామంలో ఇటీవల ఈ వినూత్న వివాహం జరిగింది. ఎందుకని అడిగితే.. మంగ్లీని దురదృష్ణం ఫెవిక్విక్ అంటుకున్నట్లు అంటుకుందట. మామూలు పెళ్లి చేసుకుంటే.. అది ఆమె కుటుంబానికి మంచిది కాదట. కుక్కను చేసుకుంటే మాత్రం దురదృష్టం భవిష్యత్తులో ఇక దరి చేరనే చేరదట. ఇదంతా ఓ స్థానిక మత గురువు చెప్పాడు.
 
 కుక్కతో వెంటనే పెళ్లి చేయాలని ఆదేశించడంతో ఇటీవల ఈ కల్యాణం జరిపించారు. కుక్కే కదా అని పెళ్లికూతురు తరఫువాళ్లు తేలిగ్గా తీసిపారేయలేదు. మామూలు పెళ్లి ఏ స్థాయిలో జరుగుతుందో కుక్కతో కల్యాణాన్నీ అదే స్థాయిలో జరిపించారు. పెళ్లి కొడుకుకు చేయాల్సిన మర్యాదలన్నీ చేశారు. పైగా.. వివాహం కోసం పెళ్లి కొడుకు షేరూను కారులో తీసుకురావడం విశేషం. ఈ వివాహం అనంతరం మంగ్లీ మామూలుగానే ఉండొచ్చట. విడాకులు వంటివి అవసరం లేదు. తర్వాత తనకు నచ్చినవాడిని ఆమె వివాహం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement