![How many years We'll be healthy?](/styles/webp/s3/article_images/2017/10/23/HEALTH.jpg.webp?itok=6xWPxz_t)
మనం ఎన్నేళ్లు ఆరోగ్యంగా ఉంటామో.. ఎప్పుడు సమస్యలు చుట్టుముడతాయో తెలుసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమే అంటున్నారు గోల్డెన్‌సన్ సెంటర్ ఫర్ ఆక్చూరియల్ రీసెర్చ్ శాస్త్రవేత్త జై వడివేలు! చిన్న లెక్క వేస్తే సరి ఆ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి అనారోగ్యం బారిన పడేందుకు మధ్య ఉండే కాలాన్ని ఆరోగ్యకర ఆయుఃప్రమాణంగా, మంచాన పడి చనిపోయే వరకూ ఉండే కాలాన్ని అనారోగ్య ఆయుః ప్రమాణంగా వర్గీకరించి మరీ లెక్కలు కట్టేయవచ్చని అంటున్నారు. కాకపోతే కావాల్సిందల్లా మీ జీవనశైలికి సంబంధించిన వివరాలు మాత్రమే అని చెబుతున్నారు.
వయసు, పురుషుడా లేక మహిళనా అన్న రెండు విషయాలు కాకుండా మన ఆయుఃప్రమాణాన్ని ప్రభావితం చేసే ఇంకో అంశం మన జీవనశైలి. చక్కని ఆహారం, వ్యాయా మం, తగినంత నిద్ర ద్వారా మన ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు నిరూపించాయి. వీటితోపాటు ఆదాయం, విద్యార్హతలు, ఆరోగ్యంపై ఒక వ్యక్తికి ఉండే అవగాహన, ఓ మోస్తరుగా మాత్రమే మద్యం సేవించడం, ధూమపానం వంటివి లేకపోవడం అన్న ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఆయుష్షుపై అంచనాలిచ్చే కాలిక్యులేటర్‌ను సిద్ధం చేశారు. మీరు ఇంకెంత కాలం ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకోవాలనుకుంటే google.com/macros/s/AKfycbyuBYOmrAt4KEdpbu871fISJmOvgA2_72XY0gaFYkJVB4xNJawZ/exec లింక్‌పై క్లిక్ చేయండి. వివరాలు నింపండి. సెకన్లలో మీకు కావాల్సిన సమాచారం వస్తుంది! అయితే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment