పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో మరోసారి ఇస్లామోఫొబియా తెరపైకి వచ్చింది. పారిస్‌లో జరిగిన నరమేధంలో 127 మంది చనిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ.. బాధితులకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ నెట్‌వర్కింగ్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు మాత్రం ఈ దాడులకు ఇస్లాం మతం, ముస్లిం కమ్యూనిటీయే కారణమన్నట్టు విపరీత వ్యాఖ్యలు చేశారు. కొందరు ముష్కరులు చేసిన దాడిని.. మొత్తం ముస్లింలకు ఆపాదించే ప్రయత్నం చేశారు. ముస్లింలు అంటే భయపడేలా ఇస్లామోఫోబియాతో చేస్తున్న దాడిని నెటిజన్లు దీటుగా తిప్పికొట్టారు.
ముస్లింలు కూడా పారిస్ దాడులను ఖండిస్తున్నారని పేర్కొంటూ.. ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. 'నేను ముస్లింను.. పారిస్ దాడులను ఖండిస్తున్నా. మొత్తం 150 కోట్లమంది ముస్లింలు కూడా ఖండిస్తున్నారు' అంటూ పెద్దసంఖ్యలో నెటిజన్లు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అమాయకుల ప్రాణాలు బలిగొనడం ఇస్లాం మత సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పారిస్ దాడులను తాము ఖండిస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ముస్లింలు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.
I am a #Muslim. I condemn the #ParisAttack. Over 1.5 billion Muslims do. Please remember this. #paris #parisattacks pic.twitter.com/0O0H6yRbqY
— Ulviyye Heydarova (@UlviyyeH) November 14, 2015