
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌లో మీ బుర్రను హీటెక్కించే ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు పజిల్ లాంటి ప్రశ్నతో కళ్లకు పరీక్ష పెడుతూ దూసుకెళుతోంది. అదేమిటంటే నల్లటి రంగులో పేర్చిన రాళ్లు దాని ముందు ఇనుపకంచె ఏర్పాటుచేసి ఉండగా అందులో ఒక పాము కూడా ఉంది.
అయితే, ఆ పాము ఎక్కడ ఉందో కనిపెట్టండి అని అడుగుతూ జీఆర్ జెరాడ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 'ఎవరు పామును గుర్తించగలరు?' అంటూ అందులో అతడు ప్రశ్నించాడు. దాంతో చాలామంది ఇప్పటికే తమకు నచ్చినట్లుగా ఆయా ఫొటోలను పంచుకున్నారు. అందులో కొంతమంది వ్యక్తులు సరిగ్గా ఆ పాము ఎక్కడ ఉందో కూడా గుర్తించి తిరిగి పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment