
సముద్రపు నీటి నుంచి ఇంధనం హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయొచ్చు. కానీ అందుకయ్యే ఖర్చు చాలా ఎక్కువ. నీటిని విడగొట్టేందుకు పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం ఉండటమే కారణం. అయితే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్త యాంగ్ చౌకగా హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు వినూత్న పద్ధతిని కనుగొన్నారు.
సూర్యరశ్మిని ఉపయోగించి రసాయనిక పద్ధతుల్లో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టేందుకు ఓ ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు. ఇది మంచినీటితో పాటు, సముద్రపు నీటిలోని ఉప్పు, లవణాలను కూడా తట్టుకుని పని చేస్తుందని యాంగ్ చెబుతున్నారు. సముద్రపు నీటిని హైడ్రోజన్ ఉత్పత్తికి చౌకగా వాడుకోగలిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని యాంగ్ పేర్కొన్నారు.
సౌర ఫలకాలతో నేరుగా విద్యుత్తును ఉత్పత్తిచేయడం కంటే హైడ్రోజన్ వంటి ఇంధనాల ఉత్పత్తి ఎంతో మేలని, ఈ వాయువును ఫుయెల్‌సెల్స్‌లో వాడుకోగలిగితే కాలుష్యం లేని విద్యుత్‌ను పొందొచ్చని వివరించారు. భవిష్యత్తులో వ్యర్థ జలాలతోనూ హైడ్రోజన్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై పరిశోధనలు చేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment