బ్రీజ్ రైలు
బ్రీజ్.. ఇది భవిష్యత్తు రైలు.. దీనికి డీజిల్ అక్కర్లేదు.. కరెంటుతో పనిలేదు.. అదే తయారుచేసుకుంటుంది. పైగా.. ఇప్పటి రైళ్లతో పోలిస్తే పూర్తిగా రివర్సు టైపు.. వచ్చినట్లే తెలియదు.. సౌండ్‌లెస్.. సూపర్ కదూ.. అంతేనా.. ఇది మనకు అందుబాటులోకి వస్తే.. పర్యావరణానికి చేటు చేసే డీజిల్ ఇంజిన్లను పక్కనపెట్టేయొచ్చు. ఎలక్ట్రిక్ ఇంజిన్ల కోసం బోలెడంత ఖర్చు పెట్టి.. విద్యుదీకరణ పనులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ కొత్తతరం లోకోమోటివ్‌కు సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ అల్‌స్టం ఈ పనులను చేపడుతోంది. అన్నీ సరిగ్గా సాగితే.. 2021 నాటికి ఓ 100 హైడ్రోజన్ టెక్నాలజీ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment