సాక్షి, న్యూఢిల్లీ: ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చాబహార్ పోర్టు నుంచి జహేదాన్ వరకూ భారత్ నిర్మించాల్సిన రైలు మార్గాన్ని తమ సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్ పేర్కొంది. నిధులివ్వడంలో భారత్ జాప్యం చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. (చూస్తుండగానే నదిలోకి జారిన స్కూల్ బిల్డింగ్)
దాదాపు నాలుగేళ్ల క్రితం చాబహార్–జహేదాన్ మధ్య రైలు మార్గం వేయడానికి ఇరాన్, భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 3,015 కోట్ల రూపాయల వ్యయంతో 2022 నాటికి భారత్ ఈ మార్గాన్ని నిర్మించాలి. ఆసాంతం అప్ఘానిస్థాన్ బోర్డర్‌ను ఆనుకుంటూ వెళ్లే 628 కిలోమీటర్ల ఈ రైలు మార్గం అత్యంత కీలకమైనది.(అది పూర్తిగా అసత్యపు వార్త : ప్రియాంక గాంధీ)
భవిష్యత్‌లో ఈ మార్గాన్ని జరంజ్కు విస్తరిస్తామని ఇరాన్ రవాణా మంత్రి రైలు మార్గ శంకుస్థాపన సందర్భంగా మహమ్మద్ ఇస్లామీ పేర్కొన్నారు.
చైనాతో భారీ ఒప్పందం
ఇరాన్, చైనా మధ్య 30 లక్షల కోట్ల రూపాయల ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. దీని ప్రకారం వచ్చే 25 ఏళ్లలో ఈ మొత్తాన్ని ఇరాన్లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు చైనా ఖర్చు చేస్తుంది. చైనా రాకతోనే ఇరాన్, ఇండియాను పక్కనబెట్టిందనే రిపోర్టులూ వస్తున్నాయి.
ఇరాన్, చైనా ఒప్పందం కుదిరితే డ్రాగన్ దేశం చాబహార్ పోర్టును ఎలాంటి పన్నులు కట్టకుండా వాడుకోవచ్చు. పోర్టుకు దగ్గర్లోని ఓ ఆయిల్ రిఫైనరీ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన తదితరాలకు చైనా సహకరిస్తుంది. చాబహార్ పోర్టు నిర్మాణంలోనూ చైనా కీలకపాత్ర పోషించనుందని సమాచారం. అంతేకాకుండా ఈ పాతికేళ్లలో చైనాకు ఇరాన్ క్రమం తప్పకుండా ఆయిల్, గ్యాస్‌ను సరఫరా చేయాలి.
చాబహార్ పోర్టు అభివృద్ధి బాధ్యతలను ఇరాన్ చాలా రోజుల క్రితమే ఇండియాకు అప్పజెప్పింది. చైనా చాబహార్‌ను అభివృద్ధి చేస్తుందని వస్తున్న రిపోర్టులను ఇరాన్ అధికారులు ఖండించారు.
ఇండియాకు పెద్ద నష్టం
చాబహార్ రైల్వే ప్రాజెక్టును కోల్పోవడం భారత్‌కు దౌత్యపరంగా పెద్ద దెబ్బని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దౌత్యం పరంగా ఒక్క పనీ సరిగా చేయలేదని విమర్శించింది. ఇంత చేసిన వాళ్లను ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు అంటూ కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment