బ్రిటన్‌లో భారతీయుడి సొంత పార్టీ
లండన్: భారత సంతతికి చెందిన హర్భజన్‌సింగ్ సొంత పార్టీని స్థాపించాడు. ఇప్పటిదాకా తాను పనిచేసిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఇమ్మిగ్రేషన్ విధానం నచ్చకపోవడంతో ఓపెన్ బోర్డర్స్ పార్టీ (ఓబీపీ) అనే పార్టీని ఏర్పాటుచేశాడు. బర్మింగ్ హాంలోని పెర్రీబార్ నియోజకవర్గానికి ఎంపీ అయిన సింగ్...దేశంలోకి అందరికీ ప్రవేశం కల్పించాలని బ్రిటన్‌ను డిమాండ్ చేశాడు.
ఈ విషయాన్ని బర్మింగ్‌హామ్ అనే పత్రిక శనివారం వెల్లడించింది. ‘యూరోపియన్ యూనియన్ (ఈయూ)ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నా. అయితే స్వేచ్ఛావాదినైనందువల్ల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలనే విశ్వసిస్తా.’అని అన్నారు. అంటువ్యాధులు, నేరచరిత్ర లేనివారికి సేచ్ఛగా ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశాడు. ఇది ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.