ప్రతీకాత్మక చిత్రం
సింగపూర్ : మైనర్ బాలుడిపై అకృత్యాలకు పాల్పడ్డ ఓ భారతీయ మహిళకు సింగపూర్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. బాలుడితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అతడిని బెదిరింపులకు గురి చేసిన కారణంగా ఆమెకు మరో ఏడేళ్ల పాటు శిక్ష పొడిగించే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు... బతుకుదెరువు కోసం సింగపూర్ వెళ్లిన ఓ భారతీయ మహిళ(33) ఓ ఇంట్లో పనిమనిషిగా చేరింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో వారి పదకొండేళ్ల కుమారుడి బాధ్యత కూడా ఆమెకే అప్పగించారు. ఈ క్రమంలో అతడిని మచ్చిక చేసుకున్న ఆ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో బాలుడిపై వికృత చర్యలకు పాల్పడేది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని, ఇందుకు సంబంధించిన వీడియోలను మీ తల్లిదండ్రులను చూపించి నిన్ను కొట్టిస్తానని బెదిరించేది. ఇలా సుమారు నాలుగు నెలల పాటు అతడికి ప్రత్యక్ష నరకం చూపించింది. దీంతో ఆ పిల్లాడు మానసికంగా కుంగిపోయాడు. అతడి ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఈ క్రమంలో పనిమనిషి ప్రవర్తనపై అనుమానం కలగడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా 2016లో నమోదైన ఈ కేసు ఈ నెల 22న విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో నేరం చేసినట్లుగా ఆమె అంగీకరించడంతో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment