ఇంగ్లీష్‌లో ఓవర్ క్వాలిఫై అయిందని ఓ భారతీయ మహిళ వీసా అప్లికేషన్‌ను యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇంగ్లీష్ భాషలో ఆమె నైపుణ్యం కలిగి ఉన్నట్టు అధికారులు చెప్పడం గమనార్హం. అలెగ్జాండ్రియా రింటుల్.. మేఘాలయలోని షిల్లాంగ్ ప్రాంతానికి చెందిన ఆమె. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్‌లో అడ్వాన్స్‌డ్ వెర్షన్‌లో ఆమె పాస్ అయ్యారు. కానీ వీసాకు అవసరమయ్యే ఎగ్జామ్ చాలా తేలికగా ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్‌ను పాస్ అవ్వాలంటూ అలెగ్జాండ్రియా వీసాను తిరస్కరించారు. దీనికి రుజువుగా ఐలెట్స్ సర్టిఫికేట్‌ను అందజేయాలని, అయితే ఈ ప్రమాణపత్రం యూకేవీ కోసం ఆమోదయోగ్యమైన ఐలెట్స్ సర్టిఫికేట్ కాదని గుర్తించినట్టు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఓ లెటర్‌ను అలెగ్జాండ్రియాకు పంపించింది. అంతేకాక అలెగ్జాండ్రియా ఇంగ్లీష్‌పై కూడా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అనుమానాలు వ్యక్తంచేసింది. మెజార్టీ ఇంగ్లీష్ మాట్లాడే భాషా దేశాల జాబితాలో కూడా అలెగ్జాండ్రియా దేశం లేదని పేర్కొంది. అలెగ్జాండ్రియా ఈ క్రిస్మస్
ను స్కాటిష్ నేషనల్‌లో ఉంటున్న తన భర్త బాబీ రింటుల్‌తో జరుపుకోవాలని వీసాను దరఖాస్తు చేసుకున్నారు. కానీ యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె వీసాను తిరస్కరించారు. యూకే ప్రభుత్వం కనీసం పార్టనర్, డిపెండెంట్ లేదా జీవిత భాగస్వామిగా పరిగణించి ఈ తిరస్కరణ చేపట్టకుండా ఉండాల్సిందని అలెగ్జాండ్రియా అన్నారు. భారత్ ఇంగ్లీష్ మాట్లాడే దేశం కాదనే రుజువు వారి వద్ద లేదని తెలిపారు. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ మీడియాను ఆమె మౌంట్ కార్మెల్ కాలేజీ బెంగళూరులో అలెగ్జాండ్రియా చదువుకున్నారు. మే 2న స్కాటిష్ జాతీయుడిని ఆమె వివాహం చేసుకున్నారు. మరోసారి వీసాను రీఅప్లయ్ చేశానని, ఇదంతా చాలా ఖరీదుతో కూడుకున్నదని చెప్పారు. ప్రతి వీసా డాక్యుమెంట్ 2వేల బ్రిటిష్ పౌండ్ల అని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆప్షన్ లేదని అలెగ్జాండ్రియా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment