'ఇంటర్నెట్ స్టార్'గా ప్రధాని మోదీ
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో బిరుదు అందుకున్నారు. గతంలో మోదీని రాక్‌స్టార్‌గా అభివర్ణించగా తాజాగా ఇంటర్నెట్ స్టార్ అనే బిరుదు కూడా ఆయన ఖాతాలో చేరింది. సోషల్ మీడియాలో మోదీ చురుగ్గా ఉంటారు. ఇంటర్నెట్ లో ఆయన గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అందుకే అంతర్జాలంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మరోసారి ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఫేమస్ మేగజీన్ టైమ్స్ విడుదల చేసిన జాబితాలో మోదీ వరుసగా రెండో ఏడాది స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా టైమ్స్ మేగజీన్ మోదీని ఇంటర్నెట్ స్టార్ అని ప్రస్తావించింది. ర్యాంకులివ్వకుండా నెట్టింట్లో అత్యంత ప్రభావవంతులైన 30 మంది వ్యక్తుల జాబితాను టైమ్స్ విడుదల చేసింది. ఆ లిస్టులో మోదీ తోపాటు, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, రచయిత్రి జేకే రౌలింగ్, సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తదితరులు ఉన్నారు.