త్వరలో ఇక ఐఫోన్7 జిగేల్..
ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ మోడళ్లతో వినియోగదారుల మదిని దోచుకున్న యాపిల్, మరో సరికొత్త డిజైన్‌తో మొబైల్ రంగ విఫణిలోకి రాబోతుంది. ఐఫోన్ 7 పేరుతో కొత్త మోడల్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అద్భుతమైన కెమెరా ఫీచర్‌తో యాపిల్ 2014లో ఐఫోన్ 6స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అనంతరం అదే డిజైన్‌తో మరిన్ని ఫీచర్స్‌ను కలుపుకొని ఐఫోన్ 6ఎస్ ను గత ఏడాది (2015)లో విడుదల చేశారు.
జానీ ఈవ్స్ టీమ్ ఈ మోడళ్ల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే.. కెమెరా లెన్స్‌లో కొన్ని లోపాలున్నట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో 6, 6ఎస్ లోపాలను సరిచేసుకుని, వినియోగదారులకు ఆమోదయోగ్యమైన రీతిలో ఐఫోన్ 7ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు యాపిల్ తెలిపింది. 5.5 అంగుళం, డ్యూయల్ లెన్స్ కెమెరాతో ఐఫోన్ 7ను రూపొందించనున్నారు. అదేవిధంగా, ప్రస్తుతమున్న వైట్ ప్లాస్టిక్ బ్యాండ్‌లను కూడా తొలగించనున్నట్టు మార్కెట్లో రూమర్స్ వస్తున్నాయి.
6, 6ఎస్ మోడళ్లలో వాడిన మెటల్ కూడా రేడియో సిగ్నల్స్‌కు ఆటంకం కలుగజేస్తుండడంతో, ఈ కొత్త మోడళ్లలో వేరే రకం మెటల్‌ను వాడాలని యాపిల్ భావిస్తోంది. అల్యూమినియం, గ్లాస్‌తో కప్పేసిన ఈ మోడళ్లకి తెలుపు రంగు వాటి రూపును నాశనం చేస్తుందని వినియోగదారులు నుంచి అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఈ లోపాలన్నింటినీ సరిచేసుకుని ఐఫోన్ 7ను రూపొందించనున్నట్టు యాపిల్ తెలిపింది. సెప్టెంబర్ తర్వాతనే సరికొత్త ఐఫోన్ 7 మార్కెట్లోకి వస్తుందని సంకేతాలు వస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్తో ఐఫోన్ 7 వినియోగదారుల ముందుకు రాబోతున్నది.