ఐసిస్ మరో పాశవిక చర్య | ISIS behead elderly cleric | Sakshi
Sakshi News home page

ఐసిస్ మరో పాశవిక చర్య

Published Mon, Nov 21 2016 2:46 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

ఐసిస్ మరో పాశవిక చర్య - Sakshi

ఐసిస్ మరో పాశవిక చర్య

కైరో: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కిరాతకానికి అంతు లేకుండా పోయింది. యువకులా వయసుమీరినవారా అనే దానితో సంబంధం లేకుండా వారు నమమేధం సృష్టిస్తున్నారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంలో ఓ వందేళ్ల వృద్ధుడిని కిడ్నాప్ చేసిన ఐఎస్ ఉగ్రవాదులు అతడి తల నరికి చంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

షేక్ సులేమాన్ అబు హరజ్ అనే సూఫీ మతగురువును ఆరిష్ పట్టణంలోని తన ఇంటి వద్ద నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అనంతరం ముసుగులు ధరించిన జిహాదిస్ట్ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా అతడి తలనరికి చంపారు. ఈ ఘటనను చిత్రీకరించి దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. అబు హరజ్ మంత్రగాడు అనే నెపంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement