ఆ దాడులకు పాల్పడింది మేమే: ఐఎస్ఐఎస్ | ISIS claims responsibility for attacks in Syria that killed at least 122 | Sakshi
Sakshi News home page

ఆ దాడులకు పాల్పడింది మేమే: ఐఎస్ఐఎస్

Published Mon, Feb 22 2016 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

ISIS claims responsibility for attacks in Syria that killed at least 122

డమాస్కస్: సిరియాలో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. ఆదివారం రాజధాని డమాస్కస్తో పాటు హోమ్స్ పట్టణంలోని రద్దీ ప్రదేశాల్లో జరిగిన పలు దాడుల్లో కనీసం 122 మంది మరణించారని సిరియన్ న్యూస్ ఏజెన్సీ సనా ప్రకటించింది. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా ప్రకటించింది.

డమాస్కస్ దక్షిణ ప్రాంతంలోని 'లేడీ జీనాబ్' ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఆత్మాహుతి డాడుల్లో 83 మంది మృతి చెందగా 172 మంది గాయపడినట్లు సనా వెల్లడించింది. హోమ్స్ పట్టణంలో జరిగిన జంట కారుబాంబు దాడుల్లో 39 మంది మృతి చెందారు. అయితే ఈ దాడిలో మృతుల సంఖ్య 46కు పెరిగినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. బస్ స్టాప్ సమీపంలో జరిగిన కారుబాంబు దాడిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు మరణించినట్లు అల్ ఇక్బారియా మీడియా సంస్థ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement