న్యూయార్క్ : అమెరికా-ఉత్తర కొరియాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (93) ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అందులో భాగంగా ఆయన ఉత్తర కొరియాకు వెళుతున్నట్లు ఆ వార్తా సంస్థపేర్కొంది. దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలోనే జిమ్మీకార్టర్ ఉత్తరికొరియా వెళుతున్నట్లు సదరు సంస్థ తెలిపింది.
డెమోక్రాట్ పార్టీకి చెందిన జిమ్మీ కార్టర్ 1977 నుంచి 1981 వరకూ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఆర్ మ్యాక్‌మాస్టర్‌కు కార్టర్ సన్నిహిత మిత్రుడు. అతని కోరిపైనే కార్టర్ పనికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై కార్టర్ వాషింగ్టన్‌లో మాట్లాడుతూ.. అమెరికా-ఉత్తర కొరియాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం చూస్తుంటే నాకు భయంగానే ఉంది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న అనుమానం వెంటాడుతోందన్నారు. ఉత్తర కొరియాను చైనా అధికంగా ప్రభావితం చేస్తోందన్న భ్రమలో అమెరికా ఉంది.. ఇదేమంత సమజసం కాదని కార్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment