
సియోల్: తమ దేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం సాగించడం ఇకనైనా ఆపకపోతే సైనిక చర్య తప్పదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాను హెచ్చరించారు. దక్షిణ కొరియాకు చెందిన మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు గాలిబుడగల్లో కరపత్రాలు నింపి, ఉ.కొరియా– ద.కొరియా సరిహద్దుల్లో వదులుతున్నారు. ఉత్తర కొరియాలో నియంతృత్వం రాజ్యమేలుతోందని, అక్కడ ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని, బానిసల్లా బతుకుతున్నారని ఈ కరపత్రాల్లో రాస్తున్నారు. ఈ చర్యను ఉత్తర కొరియా తీవ్రంగా పరిగణిస్తోంది. ద.కొరియాపై తదుపరి ఎలాంటి చర్య తీసుకోవాలన్న అంశాన్ని తమ సైనికాధికారులకే వదిలేస్తామని చెప్పారు.