
ఆ కత్తి దాడి సీసీటీవీ ఫుటేజీ విడుదల
లండన్: ఓ యువకుడి ముఖంపై కత్తితో దాడి చేసిన మరో యువకుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని లండన్ పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి స్వయంగా లొంగిపోవడమో లేదా అతడి గురించి తెలిసినవారు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
గత మే 1న నార్తాల్ట్ లోని షాడ్ వెల్ డ్రైవ్ వెలుపల ఓ యువకుడు మరో యువకుడి ముఖంపై పదునైన కత్తితో దాడి చేశాడు. దీంతో అతడి ముఖానికి తీవ్రంగా గాయమై ఆస్పత్రి కావాల్సి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించిన నిందితుడు దొరకకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో చూపిన ప్రకారం ఆ యువకుడు మెరుపు వేగంతో దాడి చేసి వెళ్లాడు.