ఐక్యరాజ్యసమితి: మహాత్మాగాంధీ చూపిన మార్గంలో శాంతియుత చర్చల మార్గాన్ని ఆశ్రయించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. హింసకు, మహిళలపై జరుగుతున్న హింసాత్మక ప్రవృత్తికి ముగింపు పలకాలని కోరారు. గాంధీ జయంతి సందర్భంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి బుధవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బాన్‌కీమూన్ ప్రసంగించారు.
గాంధీ వదిలి వెళ్లిన అహింసా విధానం ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉందన్నారు. ఆయుధాల ద్వారా శాంతిని సాధించలేమని ఆయన చెప్పారు. అందుకే సిరియా సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని తాను సూచించినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారుడు ఆర్‌డీ పట్నాయక్ రూపొందించిన గాంధీ చిత్రాన్ని యూఎన్ 68వ సాధారణ సభ అధ్యక్షుడు జాన్‌ఆషే ప్రదర్శించారు. ఈ సందర్భంగా సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్ ఆయన కుమారుల సంగీత ప్రదర్శన అలరించింది.
గాంధీ మార్గంలో నడుద్దాం: బాన్‌కీమూన్
Published Fri, Oct 4 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement