వ్లాదిమర్ పుతిన్ అరెస్టు
మాస్కో: వ్లాదిమర్ పుతిన్ అరెస్టయ్యాడు. ఓ సూపర్ మార్కెట్లో తగువులాడుతున్న అతడిని రష్యా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అదేంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతినేనా అరెస్టయిందని ఆశ్చర్యపోతున్నారా.. వాస్తవానికి అరెస్టయింది వ్లాదిమర్ పుతిన్ కాదు.. ఆ పేరు తనదిగా చెప్పుకున్న మరో వ్యక్తి. అతడు చేస్తున్న గందరగోళానికి ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అరెస్టు చేశారు.
ఫ్లోరిడా సూపర్ మార్కెట్ లో వ్లాదిమర్ పుతిన్ (48) అనే పేరు చెప్పుకుంటున్న వ్యక్తి.. ఆ మార్కెట్లోని ఉద్యోగులతో గొడవపడటం మొదలుపెట్టాడు. వారిని చెడామడా తిడుతూ కొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తొలుత అతడిని వారించే ప్రయత్నం చేశారు. అతడు వినకపోవడంతో అరెస్టు చేసి పేరేమిటని ప్రశ్నించారు. తన పేరు వ్లాదిమర్ పుతిన్ అని చెప్పడంతో ఖిన్నులయ్యారు. మరోమారు అడిగిన పదేపదే తన పేరు పుతినే అని చెప్పాడు.