ఫేస్‌బుక్‌ వ్యతిరేక ప్రభావంపై జుకర్‌బర్గ్‌ క్షమాపణ | Mark Zuckerberg apologises for the way Facebook has been used | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ వ్యతిరేక ప్రభావంపై జుకర్‌బర్గ్‌ క్షమాపణ

Published Tue, Oct 3 2017 4:28 AM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

Mark Zuckerberg apologises for the way Facebook has been used - Sakshi

వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ చూపిన వ్యతిరేక ప్రభావానికి బాధ్యత వహిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ బహిరంగ క్షమాపణలు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఫేస్‌బుక్‌ ప్రజలను కలపడం కంటే విడదీయటానికి ఎక్కువ ఉపయోగపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఏ సంఘటననూ జుకర్‌బర్గ్‌ ప్రస్తావించనప్పటికీ...అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా ఫేస్‌బుక్‌ను ఉపయోగించిందనడానికి సాక్ష్యాలు లభిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

జుకర్‌ బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ చేస్తూ ‘ఈ ఏడాది నేను ఎవరెవరిని బాధపెట్టానో వారందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఫేస్‌బుక్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేం దుకు ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నారు. కాగా, 2015 జూన్‌ నుంచి 2017 మే మధ్య ఓ రష్యా కంపెనీ ఇచ్చిన మూడు వేల ఫేస్‌బుక్‌ ప్రకటనల ప్రతులను కాంగ్రెస్‌కు సమర్పిస్తామని ఫేస్‌బుక్‌ ఇదివరకే ప్రకటించింది. ఈ ప్రకటనల విలువ లక్ష డాలర్లనీ, 470 నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి ఈ ప్రకటనలు వచ్చాయని ఫేస్‌బుక్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement