అంటార్కిటికా తూర్పు ప్రాంతంలో రికార్డు స్థాయిలో మైనస్ 93.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భూమిపై అతిశీతల ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో తాజాగా నమోదైన ఉష్ణోగ్రత గత రికార్డులను బద్దలుకొట్టింది. ఈ ప్రాంతంలో 1983లో రికార్డు స్థాయిలో మైనస్ 89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అంతకంటే తక్కువగా 2010 ఆగస్టు 10న ఈ ప్రాంతంలో మైనస్ 93.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ‘నాసా’ శాస్త్రవేత్తలు జరిపిన తాజా విశ్లేషణలో వెల్లడైంది. వివిధ ఉపగ్రహ పరికరాల సాయంతో ఈ ప్రాంతంలో గడచిన 32 ఏళ్ల కాలంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ‘నాసా’ శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
అంటార్కిటికాలో మైనస్ 93.2 డిగ్రీలు...
Published Wed, Dec 11 2013 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement