పాక్‌ టెర్రరిజం.. ఓ అనవసరమైన చర్చ | Modi Xi Jinping not discuss about Pak Terror Counter Record | Sakshi

పాక్‌ టెర్రరిజం.. ఓ అనవసరమైన చర్చ

Published Fri, Sep 1 2017 9:08 AM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

పాక్‌ టెర్రరిజం.. ఓ అనవసరమైన చర్చ - Sakshi

పాక్‌ టెర్రరిజం.. ఓ అనవసరమైన చర్చ

ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ స్వర్గధామంగా మారిందని డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సాక్షి, బీజింగ్‌: ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమావేశం సందర్భంగా ప్రత్యేకంగా భేటీ కానున్న మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే అదసలు ఓ అనవసరమైన అంశమంటూ డ్రాగన్ కంట్రీ తేల్చేసింది.
 
‘పాక్‌ ఉగ్ర కార్యకలాపాలపై భారత్‌ అసంతృప్తితో ఉందనే విషయం మా దృష్టిలోకి వచ్చింది. అయితే పాకిస్థాన్‌ టెర్రరిజం కౌంటర్‌ రికార్డ్‌ అన్నది ఓ అనవసరమైన అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియింగ్‌ తెలిపారు. ఆ మాటకొస్తే ఉగ్రపంజాకు బలవుతున్న దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఒకటని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాక్‌ ఎప్పుడూ ముందుంటుందని, ఆ విషయం ప్రపంచదేశాలన్నీ కూడా గుర్తించాయని ఆయన తెలిపారు.
 
పాక్‌ తోనే కాదు.. మిగతా దేశాలతో కూడా మేం మైత్రిని కొనసాగిస్తూనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతాం అని ఈ సందర్భంగా హువా చునియింగ్‌ చెప్పుకొచ్చారు. అయితే మోదీ-జింగ్‌పింగ్‌ భేటీలో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయా? అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. ట్రంప్‌ ఆరోపణల అనంతరం పాక్‌కు మద్ధతు తెలుపుతూ చైనా ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రచర్యలను అణించేందుకు పాక్‌ చూపిన చొరవను అమెరికా అప్పుడే మరిచిపోయిందంటూ చైనా విదేశాంగ శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement