వాషింగ్టన్: ఓ ఆసుపత్రిలో పాము సంచరిస్తోందన్న ఊహాగానాలు మొదలవడంతో అందులోని జనాలు భయాందోళనకు గురయ్యారు. తీరా అక్కడ పాము లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాముకు బదులుగా అక్కడి ఆపరేషన్ థియేటర్‌లో కోతి కుప్పిగంతులు వేస్తూ హల్‌చల్ చేసింది. ఈ ఘటన ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సుమారు మూడు నెలల లాక్‌డౌన్ తర్వాత ఆసుపత్రిలో శస్త్రచికిత్స సేవలను ప్రారంభించేందుకు శుక్రవారం సిబ్బంది సిద్ధమయ్యారు. (ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం)
ఇంతలో ఓ ఆపరేషన్ గదిలో కోతి కనిపించగా వెంటనే దగ్గరలోని ఎంపరర్ వ్యాలీ జూ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే సదరు సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని కోతిని పట్టుకెళ్లారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. కోతి హంగామా వల్ల ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో ఆసుపత్రిలో పెద్ద పాము కూడా తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో స్పందించిన యాజమాన్యం వీటిని ఖండించింది. ఆసుపత్రిలో పాము ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. (ఏటీఎమ్ చోరీకి యత్నించిన కోతి)
Comments
Please login to add a commentAdd a comment