కోతులూ రాతి పనిముట్లు చేసుకోగలవు! | monkeys could make Stone tools | Sakshi
Sakshi News home page

కోతులూ రాతి పనిముట్లు చేసుకోగలవు!

Published Fri, Oct 21 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

కోతులూ రాతి పనిముట్లు చేసుకోగలవు!

కోతులూ రాతి పనిముట్లు చేసుకోగలవు!

మారుమూల బ్రెజిల్‌లో తీసిన ఫొటో ఇది. ఇందులో కనిపిస్తున్న కోతుల్లో ఒకటి దిక్కులు చూస్తూంటే మరొకటి మాత్రం ఒక రాయితో మరోదానిపై కొడుతోంది. ఆ... ఏముంది దొరికిన పండును తినేందుకు చేస్తున్న ప్రయత్నమేమో అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటివరకూ మనిషి మాత్రమే తయారు చేస్తున్న రాతి పనిముట్లను ఈ కోతి సిద్ధం చేస్తోంది.

ఆక్స్‌ఫర్డ్, సా పాలో విశ్వవిద్యాలయాతోపాటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిశిత అధ్యయనం తరువాత ఈ అంచనాకు వచ్చారు. మానవ  పరిణామ క్రమంలో రాతి పనిముట్లకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలిసిందే. అయితే కోతులు ఈ పనిముట్లను ఎలా వాడుతున్నాయన్న విషయంపై మాత్రం ఇప్పటివరకూ స్పష్టత లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement