లండన్: కరోనా కారణంగా అన్ని పనులు ఇంటి నుంచే పూర్తి చేసుకుంటున్నాం. ఉద్యోగానికి కూడా గడప దాటాల్సిన పరిస్థితి లేకుండా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. అయితే పిల్లలు ఉన్న ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి తల ప్రాణం తోకకొస్తుంది. ముఖ్యంగా టీవీ జర్నలిస్టులకు ఇది మరింత కష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ డిబేట్లలో పాల్గొనే వారు కూడా ఇంటి నుంచే లైవ్‌లో వీడియో ద్వారా చర్చిస్తున్నారు. (పోలీసులకు ఫోన్: పిచ్చిపట్టిన దానిలా..)
ఈ క్రమంలో ఓ వాతావరణ యాంకర్.. వెదర్ అప్‌డేట్స్ ఇస్తున్న సమయంలో పిల్లి రావడం, మరో యాంకర్ ఇంటి నుంచే లైవ్ చేస్తుండగా, ఆమె భర్త అర్ధ నగ్నంగా దర్శనమివ్వడం.. ఇలాంటి ఎన్నో వింతలు చూడాల్సి వచ్చింది. తాజాగా బీబీసీ లైవ్‌లో పాల్గొన్న జర్నలిస్టుకు కూడా ఇలాంటి ఇబ్బందికర ఘటన ఎదురైంది. డా. క్లేర్ వెన్హామ్ అనే నిపుణురాలు ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ పరిస్థితిపై లైవ్‌లో సీరియస్‌గా చర్చిస్తోంది. ఇంతలో ఆమె కూతురు ఇంటర్వ్యూలో ప్రత్యక్షమైంది. (యాంకర్ రవి 'తోటబావి' టీజర్)
అమ్మను పిలుస్తూ డ్రాయింగ్ ఫొటో ఎక్కడ పెట్టాలంటూ చూపించసాగింది. ఇదేవీ పట్టించుకోకుండా ఆమె చెప్పుకుపోతూ ఉండగా ఆ చిన్నారి మళ్లీ తల్లిని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. సైలెంట్‌గా ఉండు అంటూ కూతురికి సైగ చేసినా ఆ చిన్నారి అల్లరి ఆపడం లేదు. దీంతో బీబీసీ యాంకర్ క్రిస్టియన్ ఫ్రాజర్ స్పందిస్తూ.. "మీ కూతురు పేరేంటి?" అని అడిగాడు. అందుకు ఆమె పెదాలపై చిరునవ్వుతో 'స్కార్‌లెట్' అని సమాధానమిచ్చింది.
అనంతరం ఫ్రాజర్ ఆ డ్రాయింగ్ ఎక్కడ పెట్టాలో చెప్పి, అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. అప్పుడు ఆ పాప కూడా లైవ్‌లో కనిపిస్తున్న యాంకర్‌ను చూస్తూ.. "అతని పేరేంటి అమ్మా?" అని అడిగింది. దీనికి యాంకర్ "నా పేరు క్రిస్టియన్" అంటూ వినయంగా సమాధానమిచ్చాడు. ఈ వీడియోను బీబీసీ యూకే ట్విటర్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. లైవ్‌లో యాంకర్ ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు అబ్బురపడుతున్నారు (వైరల్: మనసు మార్చుకున్న దొంగలు!)
“Mummy what's his name?”
— BBC News (UK) (@BBCNews) July 1, 2020
Dr Clare Wenham, we understand your struggles of working from home and looking after children 😂https://t.co/vXb15EQatL pic.twitter.com/4f3PODtJWA
Comments
Please login to add a commentAdd a comment