8 రోజుల విదేశీ పర్యటనకు మోదీ | Narendra Modi leaves on Central Asia, Russia visit | Sakshi
Sakshi News home page

8 రోజుల విదేశీ పర్యటనకు మోదీ

Published Mon, Jul 6 2015 12:10 PM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

8 రోజుల విదేశీ పర్యటనకు మోదీ - Sakshi

8 రోజుల విదేశీ పర్యటనకు మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. 8 రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఐదు మధ్య ఆసియా దేశాలతో పాటు రష్యాకు వెళతారు.

సోమవారం ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మోదీ తొలుత ఉజ్బెకిస్థాన్కు బయల్దేరివెళ్లారు. ఆ తర్వాత కజకిస్థాన్కు వెళతారు. జూలై 6-8 మధ్యన మోదీ ఈ రెండు దేశాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 8-10 తేదీల మధ్యన రష్యాలో జరిగే బ్రిక్స్, ఎస్సీఓ సదస్సుల్లో పాల్గొంటారు. జూలై 10-13 మధ్యన తుర్కెమినిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ దేశాల్లో పర్యటిస్తారు. వాణిజ్యం, ఇంధనం, ఉగ్రవాద నిర్మూలన, పరస్పర సహాకరం వంటి విషయాలపై మోదీ కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement