
వాషింగ్టన్: ‘అల్టిమా తులే’ మన భూమికి సుమారు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న మనలాంటి ఓ చిన్న ప్రపంచం. దీని ఆకారానికి సంబంధించిన కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు వారు ఊహిస్తున్న దానికంటే అనేక రెట్లు సమాంతరంగా ఉన్నట్లు నాసా హారిజాన్స్ స్పేస్‌క్రాఫ్ట్ పంపిన తాజా చిత్రాల్లో వెల్లడైంది. అల్టిమా తులేకు అతి సమీపంలోకి వెళ్లిన సమయంలో హారిజాన్స్ ఈ చిత్రాలను తీసింది.
ఒక క్రమపద్ధతిలో తీసిన ఈ చిత్రాలు అల్టిమాకు సంబంధించిన ఆకారాన్ని స్పష్టంగా కనుగొన్నట్లేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఇంతకుముందు తీయలేదని అమెరికాలోని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఈ మిషన్ ముఖ్య పరిశోధకులు అలన్ స్ట్రెన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment