అద్భుతం సృష్టించిన నాసా | NASA Spacecraft Breaks Record To Be Closest Human Made Object To The Sun | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 30 2018 11:30 AM | Last Updated on Tue, Oct 30 2018 3:10 PM

NASA Spacecraft Breaks Record To Be Closest Human Made Object To The Sun - Sakshi

నాసా

టంపా : సూర్యుడి ఉపరితలంపై పరిశోధనలకు నాసా ప్రయోగించిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌.. అద్భుతాన్ని సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రయోగించిన ఈ పార్కర్‌ సోలార్‌ అక్టోబర్‌ 29 నాటికి సూర్యుడికి అత్యంత దగ్గరగా (42.73 మిలియన్‌ కిలోమీటర్లు) వెళ్లిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని సోమవారం నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. 

తొలిసారిగా 1976 ఎప్రిల్‌లో జెర్మన్‌-అమెరికన్‌ రూపోందించిన హెలియస్‌ 2 స్పేస్‌ క్రాఫ్ట్‌ సూర్యుని ఉపరితలానికి సమీపంగా 246,960 కిలోమీటర్లు ప్రయాణించిందని,  ఈ రికార్డును పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అధిగమించిందని నాసా తెలిపింది. తమ అంచనా ప్రకారం 2024లో ఈ పార్కర్‌ సొలార్‌ ప్రోబ్‌ సూర్యుని ఉపరితలానికి అతిసమీపంగా (3.83 మైల్స్‌) వెళ్తోందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement