నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం | New UK visa rules for non-EU nationals come in force | Sakshi
Sakshi News home page

నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం

Published Thu, Nov 24 2016 8:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం

నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం

యూరోపియన్‌ యూనియనేతర ప్రజల కోసం యూకే ప్రభుత్వం వీసా విధానంలో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

లండన్‌: వలసదారుల సంఖ్యను నియంత్రించేందుకు యూరోపియన్‌ యూనియనేతర ప్రజల కోసం యూకే ప్రభుత్వం వీసా విధానంలో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల భారీ సంఖ్యలో భారత ఐటీ ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. యూకే హోం శాఖ గత నెలలో ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం... నవంబర్‌ 24న లేదా ఆ తర్వాత టైర్‌ 2 అంతర కంపెనీ బదిలీ(ఐసీటీ) కోసం చేసుకునే దరఖాస్తులకు కనీస వేతనం 30 వేల పౌండ్లు ఉండాలి. ఇంతకు పూర్వం ఇది 20 వేల 800 పౌండ్లు. ఐసీటీ విధానం కింద జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే దక్కించుకున్నారని యూకే మైగ్రేషన్‌ అడ్వైజరీ తెలిపింది.  

వీసా విధానంలో చేసిన మార్పులు మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమించనున్నాయి. వేతన పరిమితిని కేవలం టైర్‌ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement