అమెరికా విదేశాంగ మంత్రిగా నిక్కీ! | Nicky as United States Foreign Minister | Sakshi
Sakshi News home page

అమెరికా విదేశాంగ మంత్రిగా నిక్కీ!

Published Fri, Nov 18 2016 2:51 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

అమెరికా విదేశాంగ మంత్రిగా నిక్కీ! - Sakshi

అమెరికా విదేశాంగ మంత్రిగా నిక్కీ!

పరిశీలనలో భారత సంతతి మహిళ పేరు
 
 వాషింగ్టన్: భారత సంతతి మహిళ, దక్షిణ కరోలి గవర్నర్ నిక్కీ హేలీ(44).. డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లో చోటు దక్కించుకోనున్నారు. ఆమె పేరును అమెరికా విదేశాంగ మంత్రి పదవికి పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. అరుుతే న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గియాలియానీ కూడా ఈ పదవికోసం పోటీ పడుతున్నారని తెలిసింది. నిక్కీకి ఆ పదవి అప్పగిస్తే జాతి, లింగ వైవిధ్యం పాటించినట్లు ఉంటుందని భావిస్తున్నారు. నిక్కీ పేరును పలు మంత్రిత్వ శాఖలకు పరిశీలిస్తున్నారని, అందులో విదేశాంగ శాఖ కూడా ఉందని ది పోస్టు అండ్ కొరియర్ పత్రికకు దక్షిణ కరోలినా లెఫ్టినెంట్ గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ చెప్పారు. ఈ వార్తల నేపథ్యంలో నిక్కీ..  ట్రంప్‌ను కలుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు ముందు ట్రంప్‌కు మద్దతిస్తున్నానని నిక్కీ ప్రకటించారు. ఇపుడు నిక్కీ పేరు కూడా వినబడుతుండటంతో ట్రంప్ కేబినెట్ పరిశీలనలో రెండో భారత సంతతి వ్యక్తికి చోటు దక్కినట్లరుుంది. ఇంతకు ముందు లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్న విషయం విధితమే.

 మోదీకి ట్రంప్ ఫోన్ .. అమెరికాకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా కొత్తగా ఎన్నికై న  ట్రంప్, మైక్ పెన్‌‌సలు భారత ప్రధాని  మోదీ సహా ప్రపంచంలోని 30 మంది కీలక నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ట్రంప్ అధికార మార్పిడి బృందం వెల్లడించింది. ట్రంప్ ఫోన్ చేసిన ఇతర నేతల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, తదితరులున్నారు. తన ముఖ్య వ్యూహకర్తగా ట్రంప్ నియమించిన స్టీవ్ బ్యానన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని 168 మంది డెమోక్రాట్లు ట్రంప్‌ను కోరారు. బ్యానన్‌కు శ్వేత జాతీయవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నారుు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయనను కలవనున్న తొలి అమెరికాయేతర నేతగా జపాన్ ప్రధాని షింజో అబే నిలవనున్నారు. పెరూలో భేటీ జరగనుంది. కాగా, అమెరికా గూఢచారుల చీఫ్ జేమ్స్ క్లాప్పర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒబామా పదవీకాలం పూర్తరుు్య, ట్రంప్ అధికారం చేపట్టడానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement