అమెరికాలో మరోసారి కాల్పులు.. 9 మంది మృతి | Nine Dead In Ohio Shooting | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరోసారి కాల్పులు.. 9 మంది మృతి

Published Sun, Aug 4 2019 2:22 PM | Last Updated on Sun, Aug 4 2019 8:53 PM

Nine Dead In Ohio Shooting - Sakshi

ఓహియో: అమెరికా మరోసారి కాల్పులతో అట్టుడికింది. ఓహియో, డేటాస్‌లోని ఓ బార్‌ వెలుపల దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా, 16 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. తాము కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని.. దుండగుడిని మట్టుబెట్టినట్టు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తలించినట్టు పేర్కొన్నారు.

కాగా, ఈ ఘటనకు కొన్ని గంటల ముందే టెక్సాస్‌లోని వాల్‌మార్ట్‌లో జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక రోజు వ్యవధిలోనే అగ్రరాజ్యంలో రెండు చోట్ల కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. 

చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement