పాకిస్థాన్‌లోనూ పెద్దనోట్ల రద్దు?
పాకిస్థాన్‌లోనూ పెద్దనోట్ల రద్దు?
Published Tue, Dec 20 2016 11:11 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
భారతదేశం అంటే ఏమాత్రం పడకపోయినా.. మన దేశం తీసుకుంటున్న చర్యలను మాత్రం అనుసరించడానికి పాక్ సై అంటోంది. తమ దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి దేశంలో ఉన్న అతిపెద్ద నోటు అయిన 5వేల రూపాయల నోటును రద్దు చేయాలని పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానం ఆమోదించింది. పాకిస్థాన్ ముస్లింలీగ్‌కు చెందిన సెనేటర్ ఉస్మాన్ సైఫ్ ఉల్లా ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి పార్లమెంటు ఎగువసభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు ఆమోదం తెలిపారు.
5వేల రూపాయల నోటును రద్దు చేయడం వల్ల బ్యాంకు ఖాతాల వినియోగం పెరుగుతుందని, లెక్కల్లోకి రాకుండా పోతున్న డబ్బు తగ్గుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. మార్కెట్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మూడు నుంచి ఐదేళ్లపాటు ఈ నోట్ల ఉపసంహరణ ప్రక్రియ జరగాలని సూచించారు. అయితే.. ఇలా నోట్లను రద్దుచేస్తే మార్కెట్లలో సంక్షోభం ఏర్పడుతుందని న్యాయశాఖ మంత్రి జహీద్ హమీద్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 3.4 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని, వాటిలో 1.02 లక్షల కోట్లు 5వేల నోట్లేనని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement