కొడుకు నీలా లేడంటూ.. తల్లిని చితక్కొట్టారు! | Pakistani mob beats mother as son does not resemble her | Sakshi
Sakshi News home page

కొడుకు నీలా లేడంటూ.. తల్లిని చితక్కొట్టారు!

Published Tue, Aug 16 2016 1:50 PM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

కొడుకు నీలా లేడంటూ.. తల్లిని చితక్కొట్టారు! - Sakshi

కొడుకు నీలా లేడంటూ.. తల్లిని చితక్కొట్టారు!

సాధారణంగా కొడుకులు తల్లి పోలిక, కూతుళ్లు తండ్రి పోలిక అంటారు. అయితే పాకిస్థాన్‌లోని లాహోర్‌లో సొంత కొడుకే అయినా తల్లి పోలికల్లో లేకపోవడంతో.. ఆమెను పిల్లలు ఎత్తుకుపోయే మహిళగా భావించి కొంతమంది కలిసి చితక్కొట్టేశారు. లాహోర్‌లోని బోగివాల్ ప్రాంతానికి చెందిన సాదియా అనే మహిళ రంగు, కొడుకు రంగు ఒకలా లేవంటూ కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె ఒక ఇంట్లోకి ఏదో దొంగిలించేందుకు వెళ్తుండగా తాము చూశామని, ఆమెతో పాటు పదేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడని ఆ గుంపులో సభ్యులు చెప్పారు.

అయితే ఆ అబ్బాయికి, తల్లికి పోలికలు లేకపోవడంతో.. ఆమె ఆ పిల్లాడిని దొంగిలించి ఉంటుందని అనుకున్నారు. అయితే, అక్కడకు దగ్గర్లోని ఓ కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి.. పోలీసులకు అప్పగించారు. ఆ పిల్లాడు ఆమె కొడుకేనని గుర్తించిన పోలీసులు ఆమెను విడిచిపెట్టారు. అయితే.. ఆ గుంపుపై ఫిర్యాదు చేసేందుకు ఆమె నిరాకరించింది. ఆ గుంపులో దాదాపు 25 మందికి పైగా ఉన్నారు. వాళ్లలో మహిళలు సైతం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement