
ఇస్లామాబాద్ : కొత్తగా ఏదైనా షాపు కానీ, హోటల్ గానీ ఓపెన్ చేసినపుడు కస్టమర్లను ఆకర్షించటం కోసం ఆఫర్లు పెట్టటం పరిపాటి. వ్యాపారం ఏదైనా ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకర్షించటం అన్నది ప్రస్తుత మార్కెటింగ్ స్ట్రాటెజీ. అదే విధంగా పాకిస్తాన్‌లోని బహవాల్‌పుర్‌లో కొత్తగా తెరవనున్న ఓ ఫంక్షన్ హాలు కూడా తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు, మూడు, నాలుగో సారి పెళ్లి చేసుకోవాలనుకునే మగవారికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇస్తామంటోంది. మగాళ్లను ఆకర్షించటానికి ఓ ప్రచార వీడియోను సైతం తయారు చేసి జోరుగా ముందుకు దూసుకుపోతోంది. ‘‘ దమ్ముంటే మైదానంలోకి దిగండి. ఇంకో పెళ్లి చేసుకుని చూపించండి. బహవాల్‌పుర్‌లో తెరవబోతున్న కొత్త ఫంక్షన్ హాల్ మీకు బంపర్ ఆఫర్ ఇస్తోంది’’ అంటూ వాయిస్ ఓవర్ కలిగిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేదో బాగుందనుకుంటే పొరపాటే! ఫంక్షన్ హాల్ కండీషన్లు చదివితే మన మతి పోతుంది.
రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ఆ వ్యక్తి మొదటి భార్య వచ్చి ఫంక్షన్ హాల్ బుకింగ్ చేయాలి. 3,4 పెళ్లిళ్లకు కూడా ఇదే కండీషన్ వర్తిస్తుంది. ఎవరైతే ఈ కండీషన్లు సక్రమంగా పూర్తి చేస్తారో వారికి బుకింగ్ కన్‌ఫర్మ్ అవుతుంది. పాకిస్తాన్ నలుమూలలనుంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రెండో పెళ్లి చేసుకునేవారికి 50 శాతం డిస్కౌంట్, మూడో పెళ్లి చేసుకునేవారికి 75 శాతం డిస్కౌంట్, నాలుగో పెళ్లి చేసుకునేవారికి వాలిమా ఉచితమని నిర్వహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment