సిరియాలో వేలు పెడతారా.. అందుకే దాడి! | Paris Attacker Blamed Hollande For Interfering In Syria, says Witness | Sakshi
Sakshi News home page

సిరియాలో వేలు పెడతారా.. అందుకే దాడి!

Published Sat, Nov 14 2015 10:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

సిరియాలో వేలు పెడతారా.. అందుకే దాడి!

సిరియాలో వేలు పెడతారా.. అందుకే దాడి!

అసలు ఫ్రాన్స్ మీద ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది... దాడి చేసింది ఎవరు.. ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తాయి. ఇస్లామిక్ స్టేట్ వాళ్లే దాడి చేసి ఉంటారని భావించినా, తొలుత స్ఫష్టమైన ఆధారాలేవీ లభించలేదు. తర్వాత మాత్రం దాడి చేసింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. అయితే అసలు ఈ దాడికి కారణం ఏంటన్నది మాత్రం తర్వాత తెలిసింది. సిరియా విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఈ దాడి చేశామని దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాది చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

''ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌దే తప్పని అతడు స్పష్టంగా చెప్పాడు.. నేను ఆ విషయం విన్నాను. సిరియా విషయంలో హోలండ్ జోక్యం చేసుకుని ఉండకూడదన్నాడు. ఇరాక్ గురించి కూడా మాట్లాడాడు'' అని పియెర్ జనాస్జక్ అనే రేడియో ప్రెజెంటర్ తెలిపారు. ద బటాక్లాన్ అనే సంగీత వేదిక వద్ద ఈ ఉగ్రవాది మాట్లాడుతుండగా తాను విన్నానని అన్నారు. 'అల్లాహో అక్బర్' అంటూ మరికొందరు ఉగ్రవాదులు నినాదాలు కూడా చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement