చిలుక అరిచింది.. పోలీసులొచ్చారు!  | Parrot Says Help Me Florida Man Call To Police | Sakshi
Sakshi News home page

చిలుక అరిచింది.. పోలీసులొచ్చారు! 

Published Tue, Jan 7 2020 11:37 PM | Last Updated on Tue, Jan 7 2020 11:42 PM

Parrot Says Help Me Florida Man Call To Police - Sakshi

వాషింగ్టన్‌: చిలుకలకు మాటలు నేర్పిస్తే అవి బాగా నేర్చకోగలవని తెలిసిందే. అయితే, ఇలా మాటలు నేర్చుకున్న ఓ చిలుక ఏకంగా పోలీసులను పరుగులు పెట్టించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నాలుగు రోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి నుంచి ఎవరో మహిళ ‘హెల్ప్‌... హెల్ప్‌..’అని అరుస్తున్నట్లు వినిపించడంతో పక్కింటాయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఇంటికొచ్చారు. అరుపులు వినిపించిన ఇంటికెళ్లి ఆరాతీశారు. విషయం తెలుసుకొని, నవ్వుకొని వెనుదిరిగారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సాయం చేయమని అరిచింది ఓ చిలుక! దాని పేరు ర్యాంబో.

దాని యజమాని మొదట్లో ఆ చిలుకను పంజరంలో ఉంచి ‘హెల్ప్‌.. నన్ను బయటకు విడిచిపెట్టండి’అనే పదాలు నేర్పించాడు. కొన్నాళ్లకు దాన్ని పంజరం నుంచి స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. కానీ, అది మాత్రం ఆ పదాలు మరిచిపోలేదు. దీంతో ఆ చిలుక అరుపులు విన్న పొరుగింటి వ్యక్తి ఎవరో మహిళా ప్రమాదంలో ఉందని అనుమానించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రావడం దగ్గర నుంచి వాళ్లు వెళ్లేంత వరకు జరిగిన ఘటనంతా ఆ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement