వాషింగ్టన్: పాకిస్తాన్‌లో మళ్లీ తాను అధికారంలోకి రావడానికి రహస్యంగా సాయం చేయాలని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అమెరికా చట్ట సభ్యులను కోరుతున్న వీడియో బయటపడింది. పాక్‌లోని అబోటాబాద్‌లో అల్‌కాయిదా చీఫ్ లాడెన్ స్థావరాన్ని గుర్తించడంలో నిఘా సంస్థ ఐఎస్‌ఐ విఫలం కావడంపై తాను సిగ్గు పడుతున్నట్లు ముషార్రఫ్ చెప్పారు. అమెరికా ఇచ్చిన నిధులతోనే ఉగ్రవాదంపై పోరాడామనీ, పాక్‌లో పేదరికాన్ని తగ్గించామని చెప్పారు. తాము నిధుల్ని ఉగ్రవాదంపై పోరాటం కోసం ఇచ్చామనీ, పేదరిక నిర్మూలనకు కాదని అమెరికా చట్టసభ్యులు ఘాటుగా స్పందించారు.
‘అబోటాబాద్‌లో లాడెన్ ఆచూకీ తెలుసుకోకపోవడం ఐఎస్‌ఐ నిర్లక్ష్యమే. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కూడా 2001, సెప్టెంబర్ 11న ఉగ్రదాడుల విషయంలో ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది’ అని తెలిపారు. 2012 తర్వాత తీసినట్లు భావిస్తున్న ఈ వీడియోను ముషార్రఫ్ వ్యతిరేకి అయిన కాలమిస్టు గుల్ బుఖారీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 2001–08 మధ్యకాలంలో పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్, అభిశంసన నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లిన ముషార్రఫ్ మళ్లీ పాక్‌కు రాలేదు. 2007లో రాజ్యాంగాన్ని రద్దుచేయడంతో ముషార్రఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment