బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్ మోదీల ఉదంతాన్ని ప్రస్తావించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. న్యాయపరమైన అంశాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారని ఆ వర్గాలు తెలిపాయి. యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బుధవారం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో థెరెసా మే అధికారిక నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాల్యా, లలిత్ మోదీలను భారత్‌కు అప్పగించడంలో సహకరించాలని మోదీ బ్రిటన్ ప్రధానిని కోరినట్టు తెలిసింది.
కాగా భారత్, బ్రిటన్ ప్రజలకు లబ్ధి చేకూరేలా భారత్, బ్రిటన్‌లు పనిచేస్తాయని భేటీ అనంతరం థెరిసా మే వ్యాఖ్యానించారు. నేటి భేటీతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నూతనోత్తేజం నెలకొందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక విజయ్ మాల్యా, లలిత్ మోదీల అప్పగింతపై ఇరువురు నేతల మధ్య ప్రస్తావన చోటుచేసుకుందని అధికారులు నిర్ధారించకున్నా న్యాయపరమైన అంశాల్లో సహకారానికి అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment