విదేశీ పర్యటనలో మోదీ మరోసారి.. | PM Modi plays drum along with Tanzanian President John Magufuli | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటనలో మోదీ మరోసారి..

Published Sun, Jul 10 2016 6:04 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

విదేశీ పర్యటనలో మోదీ మరోసారి.. - Sakshi

విదేశీ పర్యటనలో మోదీ మరోసారి..

దారుస్ సలామ్: విదేశీ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన కళను ప్రదర్శించారు. టాంజానియాకు వెళ్లిన మోదీ ఆ దేశాధ్యక్షుడు జాన్ పాంబె జోసెఫ్ మగుఫులితో కలసి ఆదివారం ఉత్సాహంగా డ్రమ్ వాయించారు. ఇద్దరూ ఓ నిమిషం సేపు డ్రమ్లు మోగించారు. అంతకుముందు స్టేట్ హౌస్ వద్ద మోదీకి సాంప్రదాయ స్వాగతం లభించింది. కాగా 2014లో మోదీ జపాన్ పర్యటనకు వెళ్లినపుడు కూడా డ్రమ్ వాయించారు.

టాంజానియా పర్యటనలో మోదీ భారత సంతతికి చెందినవారితో సమావేశమై మాట్లాడారు. అంతకుముందు భారత్-టాంజానియా మధ్య పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాల్లో ప్రజా అరోగ్యం ప్రధాన అంశమని మోదీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మోదీ టాంజానియా పర్యటన ముగించుకుని కెన‍్యా పర్యటనకు బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement