మాస్కో : దేశ చరిత్రలోనే అతి పెద్ద ఖండాతర అణు క్షిపణి(ఐసీబీఎమ్) ప్రయోగానికి రష్యా సిద్ధమైంది. శాటన్-2 క్షిపణి సింగిల్ స్ట్రైక్‌తో అమెరికా రక్షణ వ్యవస్థను బద్దలు కొట్టగలదని రష్యా చెబుతోంది. 40 మెగా టన్నులు బరువు గల డజను న్యూక్లియర్ వార్ హెడ్‌లను మోసుకెళ్లగల సామర్ధ్యం దీని సొంతమని చెప్పింది.
1945లో అమెరికా హిరోషిమా, నాగసాకిలపై విసిరిన ఆటం బాంబు కంటే శాటన్-2 దాదాపు 2 వేల రెట్లు శక్తిమంతమైనది పేర్కొంది. కాగా, శాటన్- 2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇందుకు కారణం తరచూ మిస్సైల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడమే.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది చివర్లో రష్యా ఈ ప్రయోగం చేపట్టనుంది. క్షిపణిని సర్వీసులోకి తీసుకునే ముందు ఇంతకుముందెన్నడూ లేనన్ని పరీక్షలు నిర్వహించాలనే యోచన చేస్తోంది రష్యా. 2019 కల్లా ఈ ప్రయోగాలను పూర్తి చేసి సర్వీసులోకి తీసుకుంటామని రష్యా అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్ధనైనా ఈ క్షిపణి చేధించగలదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment