కుక్కకు ఉన్న ప్రేమ.. తల్లికి లేదా! | Saudi Arabia: Dog saves new born baby"s life | Sakshi
Sakshi News home page

కుక్కకు ఉన్న ప్రేమ.. తల్లికి లేదా!

Published Tue, Nov 3 2015 7:14 PM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM

కుక్కకు ఉన్న ప్రేమ.. తల్లికి లేదా! - Sakshi

కుక్కకు ఉన్న ప్రేమ.. తల్లికి లేదా!

అప్పుడే పుట్టిన శిశువును ఓ శునకం నోట్లో పెట్టుకొని ఉన్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

సౌదీ అరెబియా: అప్పుడే పుట్టిన శిశువును ఓ శునకం నోట్లో పెట్టుకొని తీసుకెళ్తున్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అరబిక్ దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. కన్న తల్లి అప్పుడే జన్మించిన శిశువును చెత్తకుప్పలో వదిలి వెళ్లింది. చెత్త కుప్పలో ఉన్న ఆ శిశువును ఓ కుక్క గమనించింది. వెంటనే ఆ శిశువును బొడ్డుతాడుతో సహా నోట కరచుకొని జాగ్రత్తగా దగ్గర్లోని ఓ ఇంటి ఎదుట వదిలింది. శిశువు గమనించిన స్థానికులు ఆ శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న వివరాలను ఆ పత్రిక వెల్లడించలేదు.   

రెండు రోజుల కింద విడుదలైన ఈ ఫొటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన ప్రతి ఒక్కరు ఆ శిశువు ప్రాణాన్ని కాపాడిన శునకాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement