ప్రపంచంలోనే తొలి సెల్ఫీ...
స్మార్ట్‌ఫోన్ల సందడి మొదలైన తర్వాతే.. ఇటీవల సెల్ఫీ(స్వీయచిత్రం)ల హవా ఎక్కువైపోయింది. కానీ, ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికన్ ఫొటోగ్రాఫర్ ఒకరు 175 ఏళ్ల క్రితమే సెల్ఫీని క్లిక్‌మనిపించాడట. ఫొటోల చరిత్ర అప్పుడప్పుడే మొదలవుతున్న కాలంలో.. 1839లోనే రాబర్ట్ కార్నెలియస్ అనే 30 ఏళ్ల ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ సొంతంగా ఈ ఫొటోను తనకు తానే తీసుకున్నాడట.
అప్పట్లో అతిదగ్గరగా ఉంటేనే ఫొటోల్లో మనుషులు పడేవారు. కెమెరాను క్లిక్‌మనిపించేందుకూ ఐదు నిమిషాలు పట్టేది. అందువల్ల ఫిలడెల్ఫియాలోని తమ దుకాణం ముందు కెమెరాను ఉంచిన రాబర్ట్.. కెమెరా లెన్స్ క్యాప్‌ను తీసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఐదు నిమిషాలు కదలకుండా కూర్చుని ఈ సెల్ఫీకి పోజిచ్చాడట.