ఒకరికి ఒకరు..
ఇదో స్కూల్.. ఇటలీలోని చిన్న పట్టణం ఆల్పెటేలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న స్కూలు అని చెబుతారు. ఎందుకంటే.. ఇంతోటి స్కూల్లో ఉన్నది వీరిద్దరే. వీరిలో ఒకరు టీచర్. మరొకరు స్టూడెంట్. టీచర్ పేరు ఇసబెల్లా. స్టూడెంట్ పేరు సోఫియా(8). ఇది అక్కడి ప్రభుత్వ పాఠశాల టైపన్నమాట. దీంతో ఒక్క విద్యార్థి ఉన్నా.. స్కూల్‌ను నడిపించాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది ఈ స్కూల్లో మరో నలుగురు ఉండేవారు. ఐదవ తరగతి అయిపోగానే.. వారు వేరే స్కూల్‌కు జంపైపోయారు. దీంతో స్కూల్ మొత్తానికి సోఫియా ఒక్కర్తే మిగిలిపోయింది. మూడవ తరగతి చదువుతున్న సోఫియా.. ఒంటరిగా ఫీలవకుండా ఉండటానికి.. తన పక్కన మరికొన్ని కుర్చీలు వేసుకుని, పక్కన మిగతా విద్యార్థులు ఉన్నట్లు ఊహించుకుంటుందట. ఇటు సోఫియా సంగతెలా ఉన్నా.. అటు ఆమె తల్లిదండ్రులు మాత్రం తెగ ఆనందంగా ఫీలైపోతున్నారు. ఒక విద్యార్థికి.. ఒక టీచర్.. ఆహా.. ఇక మా సోఫియా చదువుల తల్లి అయిపోద్ది అంటూ చంకలు గుద్దుకుంటున్నారు.