
కాబూల్ : హస్కామినా జిల్లా సమీపంలో జరిపిన వైమానిక దాడిలో ఐసిస్‌కు చెందిన ఆరుగురు టెర్రరిస్ట్‌లు హతమైనట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 33మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో ఇద్దరు అధికారులు కూడా గాయపడ్డారని తెలిపింది. కాబూల్ పీడీ9 లో జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో ముగ్గురు మరణించారు. అయితే ఈ ఘటనలపై ఐసిస్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment