రూబిక్ క్యూబ్‌కు సెకనులోనే పరిష్కారం
మనిషి తన మేధను తానే పరీక్షించుకుంటూ.. సవాళ్లు సృష్టించుకుని ఎదుర్కొంటూ సాగుతుంటాడు. తన మేధస్సుకు మరింత పదును పెట్టుకుంటాడు. దీనికి ఉదాహరణ రూబిక్ క్యూబ్స్‌ను పరిష్కరించే రోబోట్‌ను ఆవిష్కరించడం. ఇప్పటివరకు మనిషి ఐదారు సెకన్లలో వాటిని పరిష్కరించేవాడు.
ప్రస్తుతం రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడంలో మనిషి రికార్డు 4,904 సెకన్లు. గతేడాది నవంబర్‌లో ఫ్లోరిడాకు చెందిన విద్యార్థులు రూపొందించిన రోబో 2.39 సెకన్లలో రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. తాజాగా జే ప్లాట్ ల్యాండ్, పాల్‌రోజ్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కేవలం 1,047 సెకన్లలోనే రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించే రోబో మెషీన్‌ను ఆవిష్కరించారు. ఈ వీడియోను జనవరి 11న యూట్యూబ్‌లో పెట్టగా ఇప్పటివరకు దాదాపు 10 లక్షల సార్లు వీక్షించారు.