rubik cube
-
అయ్యో! షి సెడ్ నో!!
అందమైన లోకం ఇతడి పేరు టాంగ్ ఓనమ్. చైనా అబ్బాయి. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు తన ప్రేమను తెలియజెయ్యాలనుకున్నాడు. మామూలుగా అయితే అబ్బాయిలు ఇల్లెక్కి ఐ లవ్ యు అని ఊరంతటికీ వినిపించేలా చెప్తారు. లేదంటే, గుట్టుగా వెళ్లి అమ్మాయి ముందు మోకరిల్లుతారు. టాంగ్ డిఫరెంట్. ఈ రెండూ చెయ్యలేదు. ఆ అమ్మాయి ముఖారవిందం వచ్చేలా ఓ పెద్ద రూబిక్ క్యూబ్‌ని తయారు చేసి ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అమ్మాయి కళ్లు మిలమిల్లాడాయి! ‘వావ్’ అంది. బట్.. సారీ చెప్పేసింది! నీ కానుకను స్వీకరించగలను కానీ, నీ ప్రేమను అంగీకరించలేను అని చెప్పేసింది! ఓనమ్ హర్ట్ అయ్యాడు. కానుక తీసుకుంది అదే పదివేలు అనుకున్నాడు. పదివేలు అనుకున్నా, టాంగ్కి ఇంకా 20 వేలు లాసే! నచ్చిన చిన్నదాన్ని రూబిక్ క్యూబ్‌లోకి తెప్పించడానికి అతడికి 460 డాలర్లు ఖర్చయింది. ఇండియన్ కరెన్సీలో ముప్పై వేలు! ఈ లెక్కలన్నీ మనవి. నిజానికి టాంగ్ డబ్బు లెక్కలు చూసుకోలేదు. పడ్డ కష్టాన్ని కూడా చూసుకోలేదు. టాంగ్ మెకానిక్. తెలివైనవాడు. తెలివైనవాడి ఎక్స్ప్రెషన్ కూడా తెలివిగానే ఉంటుంది కదా! రూబిక్తో ఐ లవ్ యు చెప్పాలన్న ఆలోచన రాగానే ముందతడు ఫొటోషాప్‌లో ఆమె ఫొటోతో నమూనా తయారుచేసుకున్నాడు. 2.1 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పులో ఆ నమూనాకు ఒక ఆకృతిని ఇచ్చాడు. ఆ ఆకృతిలోని గడులను ఫాలో అవుతూ రూబిక్ క్యూబ్‌లోని కలర్స్‌ని సెట్ చేశాడు! సక్సెస్. రెండు నెలల శ్రమ! తన ప్రియురాలి రూబిక్ ఫ్రేమ్‌ని కళ్ల నిండా చూసుకున్నాడు. తన ప్రేమ ఫలించినట్లే అనుకున్నాడు. కానీ అతడి శ్రమ ఒక్కటే ఫలించింది. శ్రమను అభినందించి ఆశ్చర్యపోయిన ఆ ప్రియురాలు, తన హృదయాన్ని మాత్రం టాంగ్‌కు అందించలేకపోయింది. ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. అవి ఏమిటి అని టాంగ్ అడగదలచుకోలేదు. మనుసులోనే ఉండిపోతే అది ప్రేమ కాదు అనుకున్నాడు. అందుకే తన ప్రేమను వ్యక్తం చెయ్యాలనుకున్నాడు. చేశాడు. అంతే. సి.ఎన్.ఎన్. టాంగ్ని ఇంటర్వ్యూ చేసింది. ఏం బాస్? ఆ అమ్మాయి కాదన్నందుకు నీకు బాధనిపించలేదా అని అడిగింది. టాంగ్ నవ్వాడు. తనను ప్రేమిస్తున్న విషయం చెప్పకుండా నా మనసులో ఉంచుకుంటే ఇంకా బాధగా అనిపించేది అన్నాడు. కుర్రాడంటే ఇలా ఉండాలి. బై ది వే... ఆ అమ్మాయిని కూడా కంగ్రాట్స్ చెయ్యాలి. ‘నో’ చెప్పడం తేలికైన సంగతి కాదు కదా! అందుకు. -
ప్చ్.. అమ్మాయి పడలేదు!
బీజింగ్: ప్రేమను వ్యక్తం చేయడంలో చైనావాళ్ల స్టైయిలే వేరు. డిఫరెంట్ గా ప్రపోజ్ చేయడంతో చైనీయులు ముందుంటారు. విభిన్నంగా ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఉత్తర చైనాలోని షన్ యాంగ్ నగరానికి చెందిన 27 ఏళ్ల టొంగ్ అయెనన్ కూడా ఈ కోవకు చెందినవాడే. తన డ్రీమ్ గాళ్ కు వెరైటీగా ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ప్రియురాలి ప్రేమను మాత్రం గెలుచులేకపోయాడు తన పొరుగింటిలో ఉన్న యువతిని టొంగ్ ఇష్టపడ్డాడు. ఆమెకు తన ప్రేమను విభిన్నంగా వ్యక్తం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 840 రూబిక్ క్యూబ్ లతో 20 గంటల పాటు శ్రమించి తనింట్లోనే ప్రేయసి చిత్రానికి ప్రాణం పోశాడు. వెరైటీగా ప్రపోజ్ చేసినా అతడిని ఆమె తిరస్కరించింది. 'రూబిక్ క్యూబ్ లతో తయారు చేసిన ఫొటోను నా డ్రీమ్ గాళ్ కు చూపించి సర్ ప్రైజ్ చేశాను. నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాను. కానీ ఆమె నా ప్రేమను తిరస్కరించింది' అని మెకానిక్ గా పనిచేస్తున్న టొంగ్ తెలిపాడు. ప్రేయసి తిరస్కరించడం పట్ల ఎలా ఫీలవుతున్నావని అడగ్గా... దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని సమాధానమిచ్చాడు. తన డ్రీమ్ గాళ్ ఫొటో తయారు చేసేందుకు 2 నెలల ముందు నుంచి ప్లాన్ వేసుకున్నానని వెల్లడించాడు. 2.1 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పుతో దీన్ని రూపొందించానని చెప్పాడు. ముందుగా ఫొటోషాప్ లో డిజైన్ చేసుకుని దాని ప్రకారం 840 రూబిక్ క్యూబ్ లతో ఈ చిత్రాన్ని తయారుచేశానన్నాడు. డిజైన్ కు అనుగుణంగా రూబిక్ క్యూబ్ ను సరిచేసుకుంటూ, ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క ఫ్రేమ్ లో వీటిని ఒకదానిపై ఒకటి అమర్చానని వెల్లడించాడు. మూడు రాత్రుల్లో 20 గంటల పాటు శ్రమించి దీన్ని రూపొందించానని, ఇందుకోసం 460 డాలర్లు వెచ్చించానని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలు చైనా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. ఆమె ఎందుకు టొంగ్ ప్రేమను తిరస్కరించిందని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. తన డ్రీమ్ గాళ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని ఆన్ లైన్ జనానికి టొంగ్ విజ్ఞప్తి చేశాడు. ఖాళీ సమయాల్లో రూబిబ్ క్యూబ్ ఆడుకుంటూ ఉంటానని, బయట తిరగడం తనకు అంతగా ఇష్టముండదని తెలిపాడు. రూబిబ్ క్యూబ్ లతో తాను తయారు చేసిన డ్రీమ్ గాళ్ ఫొటోను ఏం చేయాలన్నదే తన ముందున్న 'పజిల్' అని పేర్కొన్నాడు. -
రూబిక్ క్యూబ్‌కు సెకనులోనే పరిష్కారం
మనిషి తన మేధను తానే పరీక్షించుకుంటూ.. సవాళ్లు సృష్టించుకుని ఎదుర్కొంటూ సాగుతుంటాడు. తన మేధస్సుకు మరింత పదును పెట్టుకుంటాడు. దీనికి ఉదాహరణ రూబిక్ క్యూబ్స్‌ను పరిష్కరించే రోబోట్‌ను ఆవిష్కరించడం. ఇప్పటివరకు మనిషి ఐదారు సెకన్లలో వాటిని పరిష్కరించేవాడు. ప్రస్తుతం రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడంలో మనిషి రికార్డు 4,904 సెకన్లు. గతేడాది నవంబర్‌లో ఫ్లోరిడాకు చెందిన విద్యార్థులు రూపొందించిన రోబో 2.39 సెకన్లలో రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. తాజాగా జే ప్లాట్ ల్యాండ్, పాల్రోజ్ అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కేవలం 1,047 సెకన్లలోనే రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించే రోబో మెషీన్‌ను ఆవిష్కరించారు. ఈ వీడియోను జనవరి 11న యూట్యూబ్‌లో పెట్టగా ఇప్పటివరకు దాదాపు 10 లక్షల సార్లు వీక్షించారు. -
రికార్డ్ బ్రేక్
రూబిక్ క్యూబ్‌లో గాదిరాజు కృష్ణంరాజు రికార్డు బద్దలు కొట్టాడు. అత్యధిక క్యూబ్‌లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. నిర్విరామంగా 24 గంటలపాటు ఒంటిచేత్తో 2,176 క్యూబ్‌లు చేసి రికార్డులకెక్కాడు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఫీట్‌ని మొదలు పెట్టి.. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవంతంగా ముగించాడు. ‘అనుకున్నది సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని రికార్డులను ఛేదిస్తా. రెండు చేతుల సహాయంతో 5,800 క్యూబ్‌లు చేసిన కెనడాకు చెందిన ఎరిక్ క్లమ్బ్యాక్ రికార్డును అధిగమించడం నా నెక్ట్స్ గోల్’ అని కెమికల్ రీసెర్చర్ కృష్ణంరాజు సంతోషం వ్యక్తం చేశాడు. -
ఒంటి చేత్తో క్యూ‘ట్రి’క్
రూబిక్ క్యూబ్ అంటే రంగులు కలపడం వూత్రమే కాదు... ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచే పజిల్ కూడా. రూబిక్లో రంగులను కలపడం అంటే క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే. ఎన్ని రకాలుగా క్యూబింగ్ చేయగలిగితే ఒకే సమస్యను అన్ని రకాలుగా పరిష్కరించినట్లు. ఇలాంటి రూబిక్ క్యూబ్ అందరూ చేస్తారు. అయితే వేగంగా చేయగలిగినప్పుడే మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికే ఈ స్పీడ్‌ను అందిపుచ్చుకున్న సిటీజన్ కృష్ణంరాజు గాదిరాజు ఒక చేతితో 24 గంటల పాటు వెయ్యికి పైగా క్యూబ్‌లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా దూసుకెళుతున్నాడు. ప్రసాద్ ఐమాక్స్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు క్యూబింగ్ మొదలెట్టడానికి ముందు ఈ యువకుడు ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. ‘పాఠశాల స్థాయి నుంచే క్యూబిక్ సాల్వర్ ఈవెంట్లలో పాల్గొన్నా. కాళ్లతో కూడా చేశా. కొన్ని రికార్డులు కూడా సాధించా. తొలిసారిగా ఒక్క చేతితోనే వెయ్యికి పైగా క్యూబిక్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెప్పాడు. బెంగళూరులోని క్వింటిస్లో కెమికల్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న కృష్ణమ్ భారత్‌లో స్పీడ్ సాల్వింగ్‌పై అవగాహన తీసుకొచ్చేందుకు ఈ రికార్డుకు శ్రీకారం చుట్టానన్నాడు. కెనడాకు చెందిన ఎరిక్ క్లమ్బ్యాక్ రెండు చేతులతో 5,800 క్యూబ్‌లు చేసిన గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్న కృష్ణంరాజుకు ఆల్ ది బెస్ట్. - వీఎస్ -
కలర్‌ఫుల్.. రూబిక్ క్యూబింగ్
రూబిక్ క్యూబ్.. లాజిక్, మ్యాజిక్ కలగలిపిన ఆట. భుజబలంతో కాదు.. బుర్రతో ఆడాల్సిన ఆట. విజ్ఞానం, వినోదం పంచే ఆట. అందుకే క్యూబింగ్కు ఇప్పుడు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. రూబిక్ క్యూబ్‌కు ఏకంగా క్లబ్బే ఏర్పాటైంది. ఔత్సాహికులకు శిక్షణనిస్తూ రికార్డులు కూడా సృష్టిస్తోంది. రూబిక్ క్యూబింగ్ అంటే రంగులు కలపడం వూత్రమే కాదు. టైం పాస్ గేమ్ అంతకంటే కాదు. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచే రంగుల పజిల్. రూబిక్లో రంగులను కలపడం అంటే క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే. ఎన్ని రకాలుగా క్యూబింగ్ చేయిగలిగితే ఒకే సమస్యను అన్ని రకాలుగా పరిష్కరించనట్లు. క్యూబింగ్ చేయుడం వల్ల మొదడులో న్యూరాన్లు ఉత్తేజితవువుతారుు. ఇప్పుడిప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయం గ్రహిస్తున్నారు. 40 ఏళ్ల కిందే పుట్టింది.. రూబిక్ క్యూబ్ కు దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది. 1974లో హంగెరీకి చెందిన ప్రొఫెసర్ ఎర్న్యో రూబిక్ ఆవిష్కరించాడు. ఆయున పేరుమీదే దీన్ని రూబిక్గా పిలుస్తుంటారు. మొదట్లో 3బై3 క్యూబ్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 7బై 7 క్యూబ్‌ల వరకూ వూర్కెట్లో దొరుకుతున్నారుు. సంప్రదాయ రూబిక్ కేవలం క్యూబ్ రూపంలోనే ఉంటుంది. ఇప్పడు కొత్తగా పెంటామిక్స్, పైరామిక్స్ అంటూ వివిధ రకాల రూబిక్లు కూడా వస్తున్నారుు. రూబిక్ క్యూబింగ్లో ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు, అమెరికా అగ్రభాగంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దీనిపై మనదేశంలో క్రేజ్ పెరుగుతోంది. దేశంలో మనమే టాప్.. నగరానికి చెందిన విక్రమ్ అతడి సోదరుడు వివేక్‌లకు క్యూబింగ్ అంటే చాలా ఇష్టం. దీన్ని హాబీగా నేర్చుకొని ఇప్పుడు రికార్డులు సృష్టించే స్థాయికి ఎదిగారు. మరోవైపు కనిష్కర్ అనే మరో కుర్రాడు కూడా ఆసక్తితో క్యూబింగ్ చేస్తూ మరిన్ని మెళుకవులు తెలుసుకునేందుకు విక్రమ్‌తో కలిశాడు. తర్వాత వీళ్లందరూ కలసి రెండేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా రూబిక్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రసుత్తం ఈ క్లబ్లో 200 మంది సభ్యులున్నారు. క్యూబింగ్పై ఔత్సాహికులకు అవగాహన,శిక్షణ కల్పించాలనేది ఈ క్లబ్ ఉద్దేశం. ఇందులోని సభ్యులు ఇప్పుడు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు కూడా కొల్లగొడుతున్నారు. దేశంలో క్యూబింగ్లో యాక్టివ్‌గా ఉన్నది హైదారాబాదే. తర్వాత ముంబై, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ క్లబ్లో 6 నుంచి 65ఏళ్ల వయసువారు కూడా ఉన్నారు. క్యూబింగ్ వేగంగా చేసినప్పుడే మనకంటూ ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈ క్లబ్లో సభ్యులు ఎంత వేగంగా క్యూబింగ్ చేస్తున్నామనే దానిపైనే ఎక్కువగా దృష్టిపెడుతుంటారు. శిక్షణ సంస్థలు కూడా.. క్లబ్ మాత్రమే కాదు క్యూబింగ్ కోసం ఇందులో ఉన్న కొంతమంది నగరంలోని వివిధ చోట్ల శిక్షణకూడా ఇస్తున్నారు. విక్రమ్ మారేడ్‌పల్లిలో పిల్లలకు శిక్షణ ఇస్తుంటే. అతడి తమ్ముడు బెంగళూరులో పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌నే ఏర్పాటు చేశాడు. లిమ్కాబుక్ రికార్డు... భగత్‌సింగ్ వర్థంతిని పురస్కరించుకొని గతేడాది ప్రసాద్ ఐమాక్స్‌లో క్లబ్‌లోని సభ్యులు వినూత్న ప్రయత్నం చేసి రికార్డు సృష్టించారు. క్యూబింగ్తో పాటు తమ దేశభక్తిని నిరూపించుకునే విధంగా ఏకంగా 8వేల క్యూబ్లతో భగత్‌సింగ్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న రికార్డును అధిగమించి లిమ్కాబుక్‌లో చోటుసంపాదించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని క్లబ్ సభ్యులు కనిష్కర్, విక్రమ్‌లు చెబుతున్నారు. - ప్రవీణ్ కుమార్ కాసం